నాలుగవ నెల సంస్కారం అంటే ఏమిటీ ? నాలుగవ నెల శిశువును సూర్యుడికి చూపించడం జరుగుతుంది. ఈ కార్యాన్ని నిష్క్రమణ సంస్కారం అని పిలుస్తారు. శిశువు యెక్క నాలుగవ నెలలో సూర్యోదయ సమయాన ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. గాలి బాగా ఆడే ఇంటి బయట ప్రదేశానికి శిశువును తీసుకెళ్ళి సూర్యుడికి శిశువు శరీరాన్నంతా భక్తి శ్రద్దలతో చూపించడం జరుగుతుంది.
చూడడానికి అర్థరహితంగా కనిపించినా ఇది ఓ మూఢనమ్మకం కాదు. శిశువు యెక్క శరీరం ఈ కార్యం వలన ఉదయించే సూర్యుని సూర్య కిరణాలలోని విటమిన్లను గ్రహిస్తుంది. అలా శిశువుకు క్షేమం కలుగుతుంది. అదే రోజు రాత్రి సమయంలోచంద్రుడికి కూడా శిశివు శరీరం చూపడం జరుగుతుంది. ఆ తరువాత రోజులలో కూడా కొంతకాలనం శిశువును సూర్యుడికి కొన్ని నిమిషాలు చూపించడం జరుగుతుంది.
ఇలా చేయడం ద్వారా శిశువు ఆరోగ్యవంతంగా బుద్దిశాలిగా ఉన్నతి పొందుతాడు. సూర్యడు సత్యానికి (ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు కాబట్టి) ఉత్సాహానికి (సోమరితనం సూర్యునిలోలేదు కాబట్టి) మరియు తపసుకు (క్రమం తప్పని సత్ కర్మలను అందిస్తాడు. కాబట్టి) ప్రతిరూపం కాబట్టి, ఇలా శిశువును సూర్యుడికి చూపడం వల్ల సూర్యునిలోని సద్గుణాలన్నీ శిశువు పెరుగుతున్న కొద్ది వస్తాయని ఇలా చేయడం జరుగుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: